దేశంలో మార్పు మహారాష్ట్రతోనే మొదలవుతోంది: కేసీఆర్

దేశంలో మార్పు మహారాష్ట్రతోనే మొదలవుతోంది: కేసీఆర్

దేశంలో మార్పు మహారాష్ట్రతోనే మొదలవుతోందన్నారు సీఎం కేసీఆర్.  నాగపూర్ లో బీఆర్ఎస్  కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. మహారాష్ట్రను బీఆర్ఎస్ మార్చేస్తుందన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తామని కేసీఆర్ అన్నారు. మహరాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసి మధ్యప్రదేశ్ వెళ్తామన్నారు. మధ్యప్రదేశ్ వాళ్లు తనను రమ్మంటున్నారని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో పరిస్థితులు ఇకనైనా మారాలన్నారు.  ఆలోచన విధానంలో మార్పుండనంత వరకు దేశంలో మార్పుండదన్నారు.  దేశ రాజకీయాల్లో మార్పుకోసం వచ్చిందే బీఆర్ఎస్ అని అన్నారు.

మంచిగ పనిచేసేటోళ్లకకే ప్రజలు అధికారమిస్తారని కేసీఆర్ అన్నారు.   ఎన్నికల్లో గెలవడే పార్టీల ముఖ్య లక్ష్యం అయిపోయిందని..లక్ష్యం లేని సమాజం, లక్ష్యం లేని దేశం ఎటుపోతయని ప్రశ్నించారు.  మహారాష్ట్రలో ఎన్నో నదులున్నా వ్యవసాయానికి నీళ్లు లేవని.. ఢిల్లీలోనూ సరిపడా నీళ్లు లేకపోవడం దారుణమన్నారు. దేశంలో ఉన్న నీటి వనరులు పూర్తిగా వాడుకోవడం లేదన్నారు కేసీఆర్. సరిగా నీటిని వాడుకుంటే  ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చని తెలిపారు.  

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా ప్రజలు కూడు గుడ్డ కోసం కొట్టాడుతున్నారని..ఆదివాసీలు తమ హక్కుల కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలని ప్రశ్నించారు.  గంగా యమున డెల్టాలో ఉన్న ఢిల్లీని చూస్తే బాధేస్తోందన్నారు.  దేశంలో 48 శాతం మాత్రమే రైతులున్నారని..  దేశంలో సరిపడా కరెంట్ ఉన్నా ఎందుకివ్వలేకపోతున్నారని ప్రశ్నించారు.  వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే 60 శాతం మందికి ఉపాధి వస్తుందన్నారు

తెలంగాణలో  రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని..   రైతు ఎలా చనిపోయిన రైతుబీమా ఇస్తున్నామని చెప్పారు.  తెలంగాణలో ఉచితంగా కరెంటు,నీళ్లు ఇస్తున్నామని.. మిషన్ భగరథతో ఇంటింటికి నళ్లా నీళ్లిస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణలో పండిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.  మహారాష్ట్ర బడ్జెట్  10లక్షల కోట్లకు చేరాలన్న కేసీఆర్..  అన్నం పెట్టే రైతులు చట్టాలు చేయలేరా? అని ప్రశ్నించారు.   అమెరికాలో నల్ల జాతీయుడిని అధ్యక్షుడిని చేశారని.. భారత్ లో నూ  నిమ్న వర్గాల్లో ఆనంద చూడాలన్నారు కేసీఆర్.