రోజుకు 18 గంటలు పనిచేసే లీడర్ మోడీ

 రోజుకు 18 గంటలు పనిచేసే లీడర్ మోడీ

ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా.. రోజుకు 18 గంటలు దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు మోడీ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కొనియాడారు. రోజుకు 18 గంటలు నిద్రపోయే నాయకుడు కేసీఆర్.. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయమని,  పార్టీకి జనంలో పెరుగుతున్న ఆదరణను చూసి భయపడలేక రూ.33 కోట్లు పెట్టి నగరమంతా హోర్డింగ్స్ పెట్టించారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయిందన్నారు. టీఆర్ఎస్ ను తరిమికొట్టేందుకు తయారై హైదరాబాద్ కు వచ్చిన కాషాయ సేనకు ఆయన స్వాగతం తెలిపారు.