కేసీఆర్ కొడుక్కి రాత్రికి రాత్రే జ్ఞానోదయం : బండి సంజయ్

కేసీఆర్ కొడుక్కి రాత్రికి రాత్రే జ్ఞానోదయం : బండి సంజయ్

 హైదరాబాద్, వెలుగు :  కేసీఆర్ కొడుక్కి రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయినట్టు కనిపిస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బుధవారం రాత్రి ఆయన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘ఒక్క రాత్రిలోనే ఎంత మార్పు వచ్చింది.  జైశ్రీరామ్ నినాదం మీకు తిండి, ఉద్యోగం ఇవ్వదు నుంచి రాముని ప్రార్థిద్దాం వరకూ మార్పు వచ్చింది’ అని ట్వీట్ చేశారు. భక్త రామదాసును జైల్లో పెట్టినా తానాషాకు రాముడు కలలోకి వచ్చి జ్ఞానోదయం చేసినట్టే.. కేటీఆర్ కూ అలాగే అయినట్టుందని  తెలిపారు. ఇదీ రాముడు, రాముని భక్తుల శక్తి అని పేర్కొన్నారు.