'కంటి వెలుగు' ఉంటదని కలలో కూడా ఊహించలేదు: కేసీఆర్

'కంటి వెలుగు'  ఉంటదని కలలో కూడా ఊహించలేదు: కేసీఆర్

ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు పచ్చి అబద్దాలు చెప్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వస్తే.. గోస పడతామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులోపాటు పార్టీల చరిత్ర, దృక్పథం  కూడా చూడాలని.. ఎవర గెలిస్తే బాగుపడుతామో ఆలోచించి ఓటేయాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 27వ తేదీ సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

కేసీఆర్ ప్రసంగంలో హైలెట్స్:

  • ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ.
  • కాంగ్రెస్ పాలనలో అన్నీ గోసలే.
  • 2004 లో ప్రకటించిన తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదు.
  • నేను ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నాక కాంగ్రెస్ పార్టీ దిగివచ్చింది.
  • గులాబీ జెండా పట్టి అందరం పోరాడితే కాంగ్రెస్ తెలంగాణ రాష్రాన్ని ప్రకటించింది.
  • తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం.
  • 50ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు.
  •  ఇందిరమ్మ రాజ్యంలో అకలి కేకలే వినిపించేవి.
  • దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపాం.
  • 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
  • కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.
  • కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు.
  • కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతులకు అండగా నిలిచాం. 
  • రైతులకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నం.
  • మళ్లీ అధికారంలోకి వస్తే   రైతుబంధు రూ. 16 వేలకు పెంచుతాం,
  •  రైతులు మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నం.
  • ఈ ఎన్నికల తర్వాత వృద్ధులకు రూ.5వేల పింఛన్ ఇస్తాం.
  • అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 
  • రాష్ట్ర భవష్యత్ ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయండి.
  • రైతుబంధును కాంగ్రెస్ వాళ్లే ఆపేశారు.