
హైదరాబాద్ : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు ఆయన ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించిన సీఎం.. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు.