యాదగిరిగుట్టను సందర్శించిన సీఎం కేసీఆర్

 యాదగిరిగుట్టను సందర్శించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబం తరఫున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించారు. సీఎం వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు. 

అంతకముందు ప్రధాన ఆలయం ముందు సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రులు , జిల్లా ఉన్నతాధికారులతో కలిసి... ఆలయంలోపలికి వెళ్లారు. మనువడు హిమాన్ష్ చేతులమీదుగా కేసీఆర్ ఆలయ అధికారులకు బంగారం సమర్పించారు. బాలాలయం ఆవరణలో కళావేదికకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం అధికారులతో సమీక్ష చేయనున్నారు.

భక్తుల అవస్థలు
యాదగిరి గుట్టకు సీఎం కేసీఆర్ రావడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రాకతో ఆలయ అధికారులు దర్శనాలు నిలిపివేశారు. గంటల తరబడి దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.