కేసీఆర్ ఉద్యమకారుల గొంతు కోశారు
ఆ ఫ్యామిలీకి ఫాంహౌజ్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: వివేక్
ఎల్‌ఆర్‌ఎస్‌తో వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నరు
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుల గొంతు కోసి.. ఒక్క తన కల్వకుంట్ల కుటుంబానికే మేలు చేసుకున్నారని బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని రామచంద్రాపురం డివిజన్‌లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో రాష్ట్ర ప్రజల నడ్డి విరిచి.. వేల కోట్లను దండుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని వివేక్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ మెడలు వంచి అయినా బీజేపీ ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో యూనివర్సిటీలకు వీసీలను నియమించడం లేదని.. ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో.. నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పారు. కేసీఆర్కు ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్ ను సీఎం చేయడం ఒక్కటే లక్ష్యమని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఫామ్ హౌస్‌లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని మండిపడ్డారు. ఆ తండ్రీకొడుకుల మీద ప్రజలకు నమ్మకం పోయిందన్నారు.
For More News..
