
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద కామెంట్లు చేశారు. యూపీ, బీహార్ వాళ్లను పంజాబ్‌లోకి రానివ్వొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పంజాబ్ లోని రోపర్‌లో జరిగిన రోడ్ షోలో చన్నీ మాట్లాడుతూ.. ‘‘ప్రియాంక గాధీ పంజాబ్ కోడలు. యూపీ, బీహార్, ఢిల్లీ భయ్యాలు ఇక్కడికి రాలేరు. పాలించలేరు. వారు పంజాబ్‌లోకి వచ్చేందుకు ఒప్పుకోం” అని కామెంట్ చేశారు. అయితే .. పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ నవ్వుతూ, చప్పట్లు కొట్టారు. కాగా, చన్నీ కామెంట్లపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. యూపీ, బీహార్ ప్రజలను సీఎం అవమానించారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. చన్నీ కామెంట్లను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఖండించారు. కాగా యూపీలోని కప్రాయ్ గ్రామం వద్ద ఎస్పీ కార్యకర్తలు మంగళవారం రాత్రి తన కాన్వాయ్ పై దాడి చేసి, కాల్పులు జరిపారని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కేసు పెట్టారు. కరాల్ స్థానంలో పోటీ చేస్తున్న ఎస్పీ చీఫ్ అఖిలేశ్ పై బఘేల్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు.