Keerthi Suresh : హిందీలో మరో మూవీకి మహనటి గ్రీన్ సిగ్నల్

Keerthi Suresh : హిందీలో మరో మూవీకి మహనటి గ్రీన్ సిగ్నల్

సౌత్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో రాణించిన చాలామంది హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌.. బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో జెండా ఎగరేయడమే తమ అంతిమ లక్ష్యంగా భావిస్తుంటారు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ వరుస ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు కీర్తి సురేష్ కూడా బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో సక్సెస్ అందుకోవాలని తహతహలాడుతోంది.  క్రిందటేడాది ‘బేబీ జాన్‌‌‌‌‌‌‌‌’ సినిమాతో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. తన పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా హుటాహుటిన ఈ మూవీ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంది.  ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ క్రమంలో తాజాగా మరో అవకాశాన్ని అందుకుంది కీర్తి.  రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి ఆమె సైన్ చేసినట్టు సమాచారం.

 తన పెళ్లి తర్వాత ఆమె సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఇదే కానుంది.  విద్యా వ్యవస్థలోని లోపాలు, మోసాలు నేపథ్యంలో సోషల్ సెటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇది ఉండబోతోందట. రాజ్ కుమార్ రావు, ఆయన భార్య పత్రలేఖ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  జూన్ 1 నుంచి ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరగబోతోంది. ఇందులో హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ ఇద్దరి పాత్రలకు ఈక్వల్ ఇంపార్టెన్స్‌‌‌‌‌‌‌‌ ఉండబోతోందట.  మొత్తానికి కమర్షియల్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  కీర్తి.. ఈసారి కంటెంట్‌‌‌‌‌‌‌‌ ఓరియెంట్‌‌‌‌‌‌‌‌ సినిమాలో నటిస్తోంది. ఇది కాక మరో రెండు తమిళ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌తో ఆమె బిజీగా ఉంది.