బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తం..ఒంటరిగానే బరిలోకి: కేజ్రీవాల్

బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తం..ఒంటరిగానే బరిలోకి: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆప్​ చీఫ్​, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. ఒంటరిగానే బరిలోకి  దిగుతామని తెలిపారు. గురువారం గుజరాత్​లోని గాంధీనగర్​లో  కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.

 ఈ ఏడాది చివర్లో జరిగే బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమన్నారు. ఇండియా కూటమితో తాము కలిసి పోటీ చేసేది లోక్ సభ ఎన్నికల వరకేనన్నారు. 

కాగా, కేజ్రీవాల్​ కామెంట్లపై బీజేపీ నేత అజయ్​ అలోక్ విమర్శలు గుప్పించారు. బిహార్​లో కేజ్రీవాల్​ పోటీ చేస్తే  అభ్యంతరం లేదని, ప్రజలే ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తారని  అన్నారు. ఢిల్లీ మాదిరిగా ఇక్కడి ప్రజలూ ఆ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు.