
కేరళ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించాయి. గోల్డ్ స్మగ్లింగ్, వయనాడ్ లో రాహుల్ గాంధీ ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడిని నిరసిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకుని స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన విరమించాలని స్పీకర్ కోరినా సభ్యులు వినిపించుకోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సభను పలుమార్లు వాయిదా వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. యూడీఎఫ్ ఎమ్మెల్యేలు మాత్రం బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి నిజా నిజాలు తేల్చాలని ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభ వాయిదా వేశాయాల్సి వచ్చింది.