వీడు మహా కంత్రీగాడు : మహిళా పోలీసుకే వేధింపులు.. 300 కాల్స్ చేశాడు..

వీడు మహా కంత్రీగాడు : మహిళా పోలీసుకే వేధింపులు.. 300 కాల్స్ చేశాడు..

లైంగిక వేధింపుల కేసులో ఓ వ్యక్తిని కేరళ  కోర్టు దోషిగా తేల్చింది. మహిళా పోలీస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో  మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 15 వేల జరిమానా కూడా విధించింది. 

మహిళా పోలీస్ అధికారి విధుల్లో ఉండగా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వేధించిన కేసులో ఓ వ్యక్తికి  మూడేళ్లు కఠిన కారాగార శిక్షతో రూ. 15 వేలు జరిమానా  విధిస్తూ కేరళ  తీర్పు ఇచ్చింది. కొచ్చిలోని ఓ పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి  48 గంటల్లో 300 సార్లు ఫోన్ చేసి  మహిళా పోలీస్ అధికారిని లైంగికంగా వేధించాడు.  నిందితుడిపై 354A(1)(i)(i) (లైంగిక వేధింపులకు శిక్ష), 354D(1)(ii) (శిక్ష) కింద  కేసు నమోదైంది.  ఈ కేసును విచారించిన ఎర్నాకులం అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  నిందితులను దోషులుగా నిర్దారించి శిక్ష విధించారు. నిందితుడు పదేపదే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయడం వలన విధులకు ఆటంకం కలిగిందని పోలీసులు వెల్లడించారు. అత్యవసర కాల్స్ ను రిసీవ్ చేసుకోలేకపోయామని కోర్టుకు తెలిపారు. నిందితుడు  నేరానికి  పాల్పడినట్లు కోర్టు అభిప్రాయపడటంతో  దోషిగా పరిగణించి శిక్ష విధించింది.