Insurance Tips: హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నారా..? ఏఏ విషయాలు తెలుసుకోవాలంటే..

Insurance Tips: హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నారా..? ఏఏ విషయాలు తెలుసుకోవాలంటే..

Health Insurance Buying: కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిలో హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, ప్రాముఖ్యపై అవగాహన పెరిగింది. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జీవితకాల సేవింగ్స్ రోజుల్లో కరిగిపోతున్న నేటి రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా మారింది. పైగా రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చులు ప్రజలను ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. అయితే ఒక ఇన్సూరెన్స్ పాలసీని కొనేటప్పుడు ఏఏ అంశాలను పరిశీలించాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందా..

పాలసీ కవరేజ్ అండ్ బెనిఫిట్స్..

  • పాలసీ కింద ఏవి కవర్ కావు. గది అద్దె వంటి ఖర్చులపై ఏవైనా పరిమితులు ఉన్నాయో లేదో తెలుసుకోండి.
  • ముందుగా ఉన్న అనారోగ్యాలతో పాటు ఎలాంటి రోగాలకు వెయిటింగ్ పిరియడ్ అంత కాలం ఉందనే విషయాలు గమనించాలి
  • హాస్పిటల్ లో చేరే ముందు.. డిశ్చార్జ్ అయిన తర్వాత ఖర్చులను పాలసీ కవర్ చేస్తుందో లేదో తెలుసుకోండి.
  • క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ గురించి తనిఖీ చేయండి
  • హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం లేకుండా ఇంట్లో వైద్యం పొందే డేకేర్ వంటి చికిత్సలకు కవరేజ్ గురించి కనుక్కోండి
  • మహిళలు మెటర్నిటీ బెనిఫిట్స్, వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో లేదో పాలసీ కొనుగోలుకు ముందు గమనించాలి.

దీనికి తోడు పాలసీ కింద అందే కవరేజ్, ప్రీమియం, కో పేమెంట్స్, కవరేజ్, నో క్లెయిమ్ బోనస్ వంటి ఇతర ఆర్థిక  పరమైన అంశాలను ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. ఇక పాలసీ కొనుగోలు కోసం ఏ సంస్థను ఎంచుకోవాలి అనే నిర్ణయం తీసుకోవటానికి ముందుగా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్, కస్టమర్ సర్వీస్, లైఫ్ టైమ్ రెన్యూవబిలిటీ, తక్కువ కంప్లెయింట్స్ ఉన్న సంస్థను చూసి ఎంచుకోండి.