బైడెన్ పొగడ్తలు: అమెరికాలో ఇండియన్స్ సూపర్

బైడెన్ పొగడ్తలు: అమెరికాలో ఇండియన్స్ సూపర్

ఇండియన్ కమ్యూనిటీ వ్యక్తులు అద్భుతం
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పొగడ్తలు
నాసా సైం టిస్టులతో వర్చువల్ మీటింగ్
ఇండి యన్ ఇంజనీర్ స్వాతి మోహన్‌‌‌‌తో సరదా కామెంట్స్

వాషింగ్టన్అమెరికాపై ఇండియన్ మూలాలున్న వ్యక్తులదే పెత్తనమని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సరదాగా కామెంట్ చేశారు. ఇండియన్ కమ్యూనిటీ నుంచి ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు తన ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారని ఆయన ప్రశంసించారు. ఫిబ్రవరి 18న పర్సివరెన్స్ రోవర్​ను మార్స్​పై సక్సెస్​ఫుల్​గా ల్యాండ్ చేసిన క్రమంలో గురువారం నాసా సైంటిస్టులతో బైడెన్ వర్చువల్ మీటింగ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండో అమెరికన్ లను పొగడ్తలతో ముంచెత్తారు. పర్సివరెన్స్ మిషన్ లో గైడెన్స్, నావిగేషన్ అండ్ కంట్రోల్ ఆపరేషన్లకు చీఫ్​గా వ్యవహరిస్తున్న ఇండియన్ అమెరికన్ ఇంజనీర్  స్వాతి మోహన్​తో జోవియల్​గా మాట్లాడిన బైడెన్.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఇండియన్ సంతతికి చెందిన అమెరికన్లు.. దేశంపై పెత్తనం చేస్తున్నరు. మీరు (స్వాతి మోహన్), వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, నా స్పీచ్ రైటర్ వినయ్ రెడ్డి వంటి వారే అందుకు ఎగ్జాంపుల్. మీ అందరికీ ఏం చెప్పగలను? థ్యాంక్స్ తప్ప. నిజంగా మీరంతా అద్భుతమైన వ్యక్తులు” అని బైడెన్ మెచ్చుకున్నారు.

అమెరికాకు కాన్ఫిడెన్స్ డోస్ ఇచ్చిన్రు..

‘‘మీరు టైం కేటాయించి, మాతో మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్” అని స్వాతి మోహన్ చెప్పడంతో బైడెన్ సరదాగా స్పందించారు. ‘‘నన్ను ఆటపట్టిస్తున్నారా? ఎంత గొప్ప గౌరవం ఇది? అద్భుతం. దేశంపై పెత్తనమంతా ఇండియన్ సంతతి వాళ్లదే” అని బైడెన్ కామెంట్ చేశారు. మార్స్ మిషన్ అంతా కలలా అనిపిస్తోందన్న స్వాతి మాటలపై స్పందిస్తూ.. ‘‘మీరు కోట్లాది మంది యంగ్ అమెరికన్ల కోసం ఓ డ్రీమ్ సృష్టించారు” అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్) రంగాల్లో ఇండో అమెరికన్లు అద్భుతాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా విపత్తు కారణంగా సైంటిఫిక్ లీడర్​గా అమెరికా పాత్ర మసకబారుతున్న సమయంలో మార్స్ మిషన్​ను సక్సెస్ చేసిన నాసా సైంటిస్టులు దేశానికి ఒక ‘కాన్ఫిడెన్స్ డోస్’ను ఇచ్చారన్నారు. ఈ అద్భుతంతో అమెరికన్ స్ఫూర్తిని తిరిగి వెనక్కి తెచ్చారని, ఈ విజయాన్ని తక్కువ చేసి చూసుకోవద్దన్నారు.

ఇప్పటికీ డ్రీమ్ లా ఉంది: స్వాతి మోహన్

బైడెన్​తో ఇంటరాక్షన్ సందర్భంగా నాసా ఇంజనీర్ స్వాతి మోహన్ మాట్లాడుతూ.. మార్స్ పై రోవర్​ను ల్యాండ్ చేయడం అంతా ఒక డ్రీమ్​లో జరిగినట్లుగా ఫీల్ అయ్యానని చెప్పారు. చిన్నప్పుడు స్టార్ ట్రెక్ టీవీ షో ఫస్ట్ ఎపిసోడ్​ను చూసినప్పటి నుంచే స్పేస్ గురించి ఇంట్రెస్ట్ మొదలైందని ఆమె తెలిపారు. రోవర్ ల్యాండ్ అయ్యేటప్పుడు చివరి ఏడు నిమిషాలు చాలా కీలకమని, ఆ టైంలో ఏం జరుగుతుందో, ఏమోనని అంతా టెన్షన్ పడ్డామన్నారు. చివరకు రోవర్ మార్స్ పై దిగడం, అక్కడి ప్రాంతాన్ని ఫొటోలు కూడా తీసి పంపడంతో ఎంతో సంతోషం కలిగిందని తెలిపారు. ఇదంతా తనకు ఓ కలలో జరిగినట్లుగా అనిపించిందన్నారు. బైడెన్ తో మీటింగ్ పూర్తయిన వెంటనే స్వాతి ట్వీట్ కూడా చేశారు. తనకు ఇప్పటికీ అంతా ఒక కలలా ఉందన్నారు. గొప్ప పనులు చేయాల్సి వచ్చినప్పుడు అంతా ఒక్కటిగా నిలిచి పని చేయడం అద్భుతమని స్వాతి మోహన్​ పేర్కొన్నారు.

55 మంది ఇండియన్లకు కీలక పదవులు

బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అయింది. ఎలక్షన్ ద్వారా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను మినహాయిస్తే.. ఇప్పటివరకూ 55 మంది ఇండో అమెరికన్ లను ఆయన తన ప్రభుత్వంలో కీలక పదవుల్లోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు సగం మంది మహిళలు ఉండగా, ఎక్కువ మంది వైట్ హౌజ్ లోనే పని చేస్తుండటం విశేషం.