
తమ కొత్త స్నాక్స్ కేవలం రూ. 99లకు లభిస్తాయని రెస్టారెంట్ చెయిన్ కేఎఫ్సీ ప్రకటించింది. వీటిలో చికెన్ లాంగర్, వెజ్ లాంగర్, క్లాసిక్ చికెన్ రోల్, రెగ్యులర్ చికెన్ పాప్‌కార్న్ వంటివి ఉంటాయి. క్రషర్స్, చోకో లావా, ఫ్రైస్ పెప్సీ వంటివి కూడా తక్కువ ధరల్లో లభిస్తాయని తెలిపింది. యువత, కాలేజీల స్టూడెంట్లను దృష్టిలో ఉంచుకొని వీటిని లాంచ్ చేసినట్టు కంపెనీ ప్రకటించింది. ఇవన్నీ సాయంత్రం తినే అల్పాహారాలని కేఎఫ్సీ పేర్కొంది.