హైదరాబాద్: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం శోభాయాత్ర ఘనంగా సాగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్ దగ్గరకు ఖైరతాబాద్ బడా గణనాథుడు చేరుకున్నాడు. ఇక్కడ కలశ పూజ, ఇతర పనులు అనంతరం మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. బడా గణేష్ నిమజ్జనం కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికాసేపట్లో మహా గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
జనసంద్రం నడుమ ట్యాంక్ బండ్‌కు చేరుకున్నాడు మహాగణపతి. బడా గణేష్ శోభాయాత్రకు భారీగా తరలివచ్చారు భక్తులు. ఎక్కడా ఆగకుండా సాగింది గణనాథుడి శోభాయాత్ర. జై బోలో మహారాజ్ కీ, గణపతి బప్పా మోరియా నినాదాలతో దద్దరిల్లాయి ట్యాంక్ బండ్ పరిసరాలు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది శోభాయాత్ర.
