హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణనాథుడి శోభాయాత్ర కాస్తా ఆలస్యం కానుంది. క్రేన్ సాంకేతిక లోపంతో బడా గణేష్ ఇంకా టస్కర్‌పైకి చేరుకోలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం శోభాయాత్ర ముందు రోజు రాత్రి గణపయ్యను టస్కర్ పైకి ఎక్కిస్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం బడా గణేష్‌ను లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
బాహుబలి క్రేన్ పైప్ విరిగింది. దీంతో మహాగణపతి ఇంకా టస్కర్‌పైకి చేరుకోలేదు. మరికొద్ది సేపట్లో క్రేన్ సహాయం తో టస్కర్‌పైకి చేర్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు సపోర్టింగ్ వెల్డింగ్ వర్క్స్ సాగనున్నాయి.
దీంతో ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర గంట రెండు గంటల ఆలస్యంగా మొదలు కానుంది. మహాగణపతి శోభాయాత్ర, నిమజ్జనానికి పోలీసులు అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.
