దానం ఎన్నికల పిటిషన్‌‌‌‌‌‌‌‌పై తేల్చాకే .. ఉప ఎన్నిక నోటిఫికేషన్

దానం ఎన్నికల పిటిషన్‌‌‌‌‌‌‌‌పై తేల్చాకే .. ఉప ఎన్నిక నోటిఫికేషన్
  • హైకోర్టుకు స్పష్టం చేసిన సీఈసీఎన్నికల పిటిషన్ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా ‘క్యాజువల్ వెకెన్సీ’గా పరిగణించలేం
  • సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్న ఈసీఅఫిడవిట్ దాఖలు చేయాలన్న బెంచ్
  • తొలగించిన ఓట్లను కలపకుంటే ఈసీ ఆఫీస్‌‌‌‌ను ముట్టడిస్తం: మాజీ మంత్రి దానం నాగేందర్
  • ఒక్క హిమాయత్​నగర్​ డివిజన్​లోనే 20 వేల ఓట్లు తొలగించారని ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్పై హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పిటిషన్ పెండింగ్లో ఉన్నం దున నియోజకవర్గాన్ని 'క్యాజువల్ వెకెన్సీ'గా పరిగ ణించలేమని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈసీ వైఖరిని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలనిధర్మా సనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

విజయారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్

పదో షెడ్యూల్ ప్రకారం దానం నాగేందర్పై అనర్హత వేటు పడినప్పటికీ, ఆయన 2023 ఎన్నికలో గెలుపును సవాలు చేస్తూ 2024లో దాఖలైన ఎన్నికల పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ పిటిషన్పై తేలే వరకు ఖైరతాబాద్కు ఉప ఎన్నిక నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి జనార్దన్రెడ్డి కుమార్తె విజయారెడ్డి గురు వారం లంచ్మీషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామ కృష్ణారెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది

ఎన్నిక చెల్లదని పిటిషన్

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదిస్తూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయారెడ్డిపై బీఆర్ఎ. స్ అభ్యర్థి దానం నాగేందర్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. దానం ఎన్నిక చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ ఎన్నికల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ని సెక్షన్లు 84, 98 (సి), 101 (బి) ప్రకారం పిటిషన్పై తుది నిర్ణయం వెలువడే వరకు ఖైరతాబాద్ను ఖాళీ అయిన స్థానంగా పరిగణించడానికి, ఉప ఎన్నిక ప్ర కటించడానికి వీల్లేదని వాదించారు.

నోటిఫికేషన్ ఇవ్వబోమన్న ఈసీ

ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ.. ఎన్నికల పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని క్యాజువల్ వెకెన్సీగా పరిగణించలేమని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. దానంపై అనర్హత వేటు పడిన ప్పటికీ, ఎన్నికల పిటిషన్పై నిర్ణయం వెలువడే వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ తన వైఖరిని పూర్తి వివరాలతో అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది. 

అఫిడవిట్లో సమాచారం దాచారని ఆరోపణ

దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ విజయా రెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లో .. దానం నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఫారం 26 అఫిడవిట్లో కీలక సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపించారు. ఆయన భార్యకు సంబంధించిన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదని, ఎన్నికల నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన సమాచారాన్ని పూర్తిగా పొందుపరచలేదని అభ్యం తరం వ్యక్తం చేశారు. భార్య పేరుతో ఉన్న ఆస్తులను వెల్లడించకపోవడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.వీటితోపాటు ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేసి ప్రలోభ పెట్టారనే ఆరోపణలు చేశారు. అఫిడవిట్ లో సమాచారం దాచిపెట్టడం, ఎన్నికల్లో అవినీతి, అక్ర మాలకు పాల్పడటం వంటి అంశాల ఆధారంగా దానం నాగేందర్ ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని విజయారెడ్డి హై కోర్టును కోరారు.