
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 6న విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండడంతో ఒకరోజు ముందుగానే నిమజ్జనం నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 6న మహాగణపతి శోభాయాత్ర నిర్వహించి, అదే రోజు నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది.