
నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జనం పూర్తైంది. నాలుగు గంటల శోభాయాత్ర అనంతరం ఖైరతాబాద్ మహా గణపతిని ఉత్సవ కమిటీ నిమజ్జనం చేశారు. దాదాపు 70 అడుగుల భారీ క్రేన్ సాయంతో.. భక్తుల నినాదాల మధ్య.. బడా గణేశ్ ను గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి సారిగా భక్తులు లంబోదరుడిని దర్శించుకున్నారు. భారీ విగ్రహాన్ని పెద్ద క్రేన్ తో నెమ్మడిగా ఎత్తి.. హుస్సేన్ సాగర్ లో వదిలారు.
సెప్టెంబర్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర.. మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగింది. అనంతరం ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్ 4 దగ్గర గణనాథుడికి హారతి ఇచ్చి .. మధ్యాహ్నం 2 గంటల లోపే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేశారు. లక్షల మంది భక్తులు.. బై బై గణేషా అంటూ వీడ్కోలు పలికారు. మహా గణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసే అపూర్వ ఘట్టాన్ని కోట్ల మంది టీవీలు, ఆన్ లైన్ ద్వారా వీక్షించారు. గణేష్ నవరాత్రుల్లో కోట్ల మంది భక్తులను దర్శనం ఇచ్చిన ఖైరతాబాద్ గణేషుడు.. ఈ ఏడాదికి బై బై చెప్పారు..
71 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఖైరతాబాద్గణేశుడు ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భక్తులను ఆకర్షించాడు.నవరాత్రులు పూజలందుకుని భక్తజన కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి చేరాడు.