Live Updates: ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర

Live Updates:  ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర

నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది.   గణనాథుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. గణపతి బప్పా మోరియా..జైజై గణేశ్ అనే నినాదాలతో మార్మోగుతోంది. సంప్రదాయ మేళాలతో భారీ బందోబస్తు మధ్య  గణేశ్ శోభాయాత్ర  కొనసాగుతోంది. 

ఈ శోభాయాత్ర సెన్సేషన్ ​థియేటర్ ​నుంచి ఇక్బాల్ ​మినార్, సైఫాబాద్​ ఓల్డ్ ​పీఎస్, టెలిఫోన్​ భవన్​, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ​పక్క నుంచి, సెక్రటేరియేట్​ మీదుగా సాగి..ఎన్టీఆర్​ గార్డెన్​ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్​ క్రేన్ ​వద్ద నిమజ్జనం కానుంది. మధ్యాహ్నం 1.30గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు అధికారులు. 

 

ఖైరతాబాద్ గణేశుడిని ఎక్కించిన  టస్కర్ 26 టైర్లతో 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 200 టన్నుల బరువును అలవోకగా ఎత్తగల సామర్థ్యం దీని సొంతం. శుక్రవారం అర్ధరాత్రి టస్కర్‌పై విగ్రహాన్ని కూర్చోబెట్టే వెల్డింగ్ పనులు మొదలుపెట్టారు. తెల్లవారుజాములోపే ఈ పనులు కంప్లీట్​ చేసి  భారీ గణనాథుడిని టస్కర్​పైకి ఎక్కించారు. తర్వాత మండపంలో ఎలాంటి బేస్​గడ్డర్స్​ఉన్నాయో..అదే సైజ్​లో టష్కర్​పై  ఐరన్​ గడ్డర్స్​ తో వెల్డింగ్​ చేశారు. టస్కర్​పై కూర్చోబెట్టిన తర్వాత కదలకుండా వెల్డింగ్​ చేశారు. వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్ స్తంభాలతో బలమైన బేస్‌ను ఏర్పాటు చేసి, విగ్రహాన్ని సురక్షితంగా హుస్సేన్ సాగర్ తీరంలోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు తరలించేందుకు సిద్ధం చేశారు. అబిడ్స్​కు చెందిన పూల కళాకారులతో టస్కర్​ను అందంగా అలంకరించారు. ఈ పనులతో పాటు షెడ్డు తొలగింపు పనులు కూడా కొనసాగుతున్నాయి.  

ఏ రూట్​లో వెళ్తుందంటే..

గణేశ్​ మండపం నుంచి ఉదయం 6 గంటలకు గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ శోభాయాత్ర సెన్సేషన్ ​థియేటర్ ​నుంచి ఇక్బాల్ ​మినార్, సైఫాబాద్​ ఓల్డ్ ​పీఎస్, టెలిఫోన్​ భవన్​, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ​పక్క నుంచి, సెక్రటేరియేట్​ మీదుగా సాగి..ఎన్టీఆర్​ గార్డెన్​ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్​ క్రేన్ ​వద్ద నిమజ్జనం కానున్నది.  

హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ మొత్తం 20 క్రేన్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అందులో ఒకటి బాహుబలి క్రేన్‌.  ఎన్టీఆర్‌ మార్గ్‌లో నాలుగో నంబర్  స్టాండులో  అక్కడే ఖైరతాబాద్‌ గణేశుడిని నిమజ్జనం చేస్తారు.