సంతాప సభకు వచ్చారా.. చప్పట్లు కొట్టండి! సంక్షేమ దినోత్సవంలో ఎమ్మెల్యే దానం

సంతాప సభకు వచ్చారా.. చప్పట్లు కొట్టండి! సంక్షేమ దినోత్సవంలో ఎమ్మెల్యే దానం

సంతాప సభకు వచ్చారా.. చప్పట్లు కొట్టండి!
పథకాలు తీసుకున్నప్పుడు విశ్వాసం ఉండాలె
సంక్షేమ దినోత్సవంలో ఎమ్మెల్యే దానం వార్నింగ్

హైదరాబాద్ : ‘ఏం సంతాప సభకు వచ్చారా.. నేను మాట్లడుతుంటే చప్పుట్లు కొట్టరేం.. ప్రభుత్వ పథకాలు తీసుకుని తమాషా చూస్తున్నరా.. ఆ విశ్వాసం ఉండాలి కదా.. ఇక్కడ పథకాలు తీసుకున్నరు.. ఊళ్లలో రైతు బంధు కూడా వస్తుంది.. చిన్న పిల్లలకుఉన్న తెలివి కూడా లేదు. సీఎం కేసీఆర్ మహిళలనే నమ్ముకున్నరు.. పథకాలు తీసుకున్నప్పుడు విశ్వాసం ఉండాలి కదా..!’ అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంక్షేమ దినోత్సవంలో భాగంగా శుక్రవారం (జూన్ 9వ తేదీన) జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు లక్ష రూపాయలు ఇచ్చేది కూడా తానేనన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టకున్న ఇచ్చేది దానం నాగేందరే అని గుర్తు పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. సమావేశానికి హాజరు కాని షేక్ పేట తహసీల్దార్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. రేవంత్, బండి సంజయ్ తో ఏమీ కాదన్నారు.