కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం : దానం నాగేందర్

కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం : దానం నాగేందర్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డివి ఆర్భాటాలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గమైన సికింద్రాబాద్ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికలవేళ ఆయన బస్తీ పర్యటనలు చేయడం తప్ప చేసిన అభివృద్ధి ఏమిలేదని విమర్శించారు. గోద్రా అల్లర్లపై ప్రధాని మోడీ పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోద్రా అలర్లపై బీబీసీ డాక్యుమెంటరీని దేశంలో ఎందుకు నిలిపివేశారో చెప్పాలన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.