కుక్క ఆచూకి తెలిపిన వాళ్లకు రూ.30 వేలు

V6 Velugu Posted on Sep 17, 2021

అల్లారు ముద్దుగా పెంచుకున్న తన పెంపుడు కుక్క ఆచూకి తెలిపాలని కోరింది ఖైరతాబాద్ కు చెందిన యజమాని పుష్పప్రియ. అంతేగాకుండా ఆచూకి చెప్పిన వారికి  రూ.30వేల బహుమానం అందిస్తామని ప్రకటించింది. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో నివాసం ఉంటుంది పుష్పప్రియ . ఇండియన్ డాగ్(డాలి) ఫిబ్రవరి 7న బయటకి వెళ్లి తిరిగి రాలేదని  ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై అంబర్ పేట హీహెచ్ఎంసీ ఆఫీసులో  కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఏడు నెలల నుంచి కుక్క కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు చెప్పారు. తెలుపు రంగులో ఉన్న తమ కుక్క(డాలి) ఆచూకీ తెలిసినవారికి రూ. 30 వేల రూపాయలు బహుమానం పొందవచ్చన్నారు.

Tagged dog, khairatabad, announce, Pushpapriya , Rs.30000

Latest Videos

Subscribe Now

More News