ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఫ్లాగ్ డే ఫండ్‌కు కలెక్టర్ విరాళం

ఖమ్మం క్యాంపు కార్యాలయంలో   ఫ్లాగ్ డే ఫండ్‌కు  కలెక్టర్ విరాళం

ఖమ్మం టౌన్, వెలుగు : నేడు దేశం శాంతి, భద్రతలతో ముందుకు సాగుతున్నదంటే, అది సైనికుల త్యాగం వల్లే సాధ్యమవుతుందని, సైనిక అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం అందరి బాధ్యతని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. దేశరక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం సేకరించే సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జిల్లా కలెక్టర్, దేశభక్తి చిహ్నమైన రిబ్బన్ ఫ్లాగ్ ను స్వీకరించి తన వంతు విరాళాన్ని అందజేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.చంద్రశేఖర్, ఈసీహెచ్ఎస్ ఓఐసీ వింగ్ కమాండర్ సురేంద్ర, ఎస్. అనూష, కళావాసు, వీరబాబు, సాయికుమార్ మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు సుభాని, కృష్ణమూర్తి, మాజీ సైనికులు గోపాలరావు, ఎస్ఎం. అరుణ్, హనుమంత రావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.