ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవి కాలం గురువారంతో ముగియనుందని, ఈ ఐదేండ్లలో సిటీ అంతటా రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా తెలిపారు. బుధవారం మేయర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయాంలో సిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో తమ పాలకవర్గం భాగస్వామ్యం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
