మహిళలకే పెద్దపీట!.. ఏడు మున్సిపాలిటీల్లో ఆరు మహిళలకు రిజర్వ్

 మహిళలకే పెద్దపీట!.. ఏడు మున్సిపాలిటీల్లో ఆరు మహిళలకు రిజర్వ్
  • ఖమ్మం మేయర్​ కుర్చీ జనరల్ మహిళకు కేటాయింపు
  • కొత్తగూడెం తొలి కార్పొరేషన్​ ఎస్టీ జనరల్​
  • వార్డుల్లో సగం మహిళలకే రిజర్వ్ 

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ పీఠాలను మహిళలే ఏలనున్నారు. జిల్లా పరిధిలోని మెజార్టీ చైర్ పర్సన్ ​స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. 
ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపల్ కార్పొరేషన్​ ఖమ్మం మేయర్​ను జనరల్​మహిళకు కేటాయించగా, ఏదులాపురం చైర్ పర్సన్​ ని ఎస్సీ మహిళకు, మధిర, సత్తుపల్లి, వైరా చైర్ పర్సన్ స్థానాలను జనరల్​ మహిళకు రిజర్వ్ చేశారు. కల్లూరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని మాత్రం ఎస్టీ జనరల్​ కు కేటాయించారు. అన్ని మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. ఇక ఖమ్మం మేయర్​ రిజర్వేషన్​ ను ప్రకటించినా, డివిజన్ల రిజర్వేషన్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ప్రస్తుత పాలకవర్గానికి మే 7 వరకు గడువు ఉండడంతో పాటు, డివిజన్ల పునర్విభజన చేయాలని ఇప్పటికే ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 60 డివిజన్లకు అదనంగా 8 డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశముంది. 

ఈ ప్రాసెస్​ తర్వాత డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. కాగా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మున్సిపల్ వార్డులలో రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేశామని జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తొలిసారి కార్పొరేషన్​గా మారిన కొత్తగూడెం మేయర్​ ను ఎస్టీ జనరల్​కు కేటాయించినట్లు మున్సిపల్​ శాఖ డైరెక్టర్​ శ్రీదేవి వెల్లడించారు. కొత్తగూడెం కార్పొరేషన్లలోని డివిజన్లు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్​ వార్డులను కలెక్టర్​ జితేశ్​ పాటిల్​ ప్రకటించారు.

ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​ బీసీ మహిళగా, అశ్వారావుపేట మున్సిపల్​ చైర్మన్​ జనరల్​ మహిళగా రిజర్వ్​ అయ్యాయి. డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు తారు మారు కావడంతో  పలువురు ముఖ్య నేతలకు ఆశా భంగం కలిగింది. తమకు అనుకూలంగా ఉండే వివిజన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలు రెండూ మహిళలకే రిజర్వ్​ కావడం విశేషం. అశ్వారావుపేట మున్సిపాలిటీలో తొలి సారిగా ఎన్నికలు జరుగుతున్నాయి.

ఉమ్మడిజిల్లాలో రిజర్వేషన్ల వివరాలు.. 

మున్సిపాలిటీ/    చైర్మన్​/మేయర్    వార్డులు    ఎస్టీ    ఎస్సీ    బీసీ    జనరల్    అన్​రిజర్వుడ్​

కార్పొరేషన్​                       మహిళ

ఖమ్మం    జనరల్ మహిళ

కొత్తగూడెం    ఎస్టీ జనరల్    60    11    12    07    15    14

ఏదులాపురం    ఎస్సీ మహిళ    32    3    7    6    9    7

కల్లూరు    ఎస్టీ జనరల్    20    3    5    2    6    4

మధిర    జనరల్ మహిళ    22    1    6    4    6    5

సత్తుపల్లి    జనరల్​ మహిళ    23    1    3    7    7    5

వైరా    జనరల్ మహిళ    20    1    5    4    6    4

ఇల్లెందు    బీసీ మహిళ    24    2    4    6    6    6

అశ్వారావుపేట    జనరల్​మహిళ    22    3    4    4    6     5