ఖమ్మం అత్యాచార బాధితురాలు మృతి

V6 Velugu Posted on Oct 16, 2020

అత్యాచారయత్నం చేసి పెట్రోల్ ​పోసిన ఇంటి ఓనర్ కొడుకు

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో బాలిక (13)పై అత్యాచారయత్నం,  పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలు కన్నుమూసింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న బాలిక గురువారం రాత్రి చనిపోయింది. గత నెల 18న ఖమ్మం ముస్తఫా నగర్ లో కోరిక తీర్చలేదని బాలికపై ఇంటి ఓనర్​ కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 75 శాతం కాలిన గాయాలైన బాలికకు ఖమ్మంలోని శ్రీపూజ ఆస్పత్రిలో ఇంటి ఓనర్ అల్లం సుబ్బారావు రహస్యంగా ట్రీట్​మెంట్ చేయించారు. ఈ నెల 5న కోమా నుంచి బయటపడ్డ అమ్మాయి.. అసలు విషయం చెప్పడంతో దారుణం గురించి తెలిసింది. బెటర్​ ట్రీట్​మెంట్​ కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలతో అక్కడ నుంచి రెయిన్ బో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులుగా అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటున్న బాలిక గురువారం రాత్రి చనిపోయింది. బాలికపై దారుణానికి పాల్పడిన మారయ్యను ఈనెల 6న పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం రిమాండ్​లో ఉన్నాడు.

For More News..

ఎల్ఆర్ఎస్ గడువు పెంచిన ప్రభుత్వం

వరదల వల్ల 35 వేల ఇండ్లకు కరెంట్​ కట్​

నగరంలో వరదల్లో గల్లంతై చనిపోయింది వీళ్లే..

Tagged Hyderabad, Telangana, Khammam, osmania hospital, rape victim dies

Latest Videos

Subscribe Now

More News