V6 News

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. చేయిచేసుకున్న CI

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన..  చేయిచేసుకున్న CI

ఆత్మహత్యా యత్నం చేసిన శ్రీనివాసారెడ్డి పరిస్థితి విషమం

ఖమ్మంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యా యత్నంతో ఉద్రిక్తపరిస్తితులు ఏర్పడ్డాయి. పెద్దసంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన కార్మికులు ఖమ్మం బస్టాండుతో పాటు, మయూరి సెంటర్ లో ఆందోళనకు దిగారు.  దీంతో ముఖాలకు కర్చీఫ్ లు కట్టుకుని వచ్చిన పోలీసులు, కార్మికులపై దాడి చేశారు. మీడియాపై కూడా దాడి చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థులు నెలకొనడంతో… భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు ఖమ్మం విపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. అయితే కేసీఆర్ తీరుకు నిరసనగా… ఈనెల 19న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు.

ఆత్మహత్యా యత్నం చేసిన శ్రీనివాసారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. 90శాతం గాయాలు కావడంతో మెరుగైన వైద్యం ఖమ్మంలో దొరకలేదని తెలిసింది. ఆందోళనలు ఎక్కువవుతాయని శ్రీనివాస్ రెడ్డిని ఎక్కడికి తరలించారో తెలియడంలేదు.. మరింత సమాచారం అందాల్సి ఉంది.