ఖానాపూర్ లో మందు తాగొద్దన్నందుకు యువకుడు సూసైడ్

ఖానాపూర్ లో మందు తాగొద్దన్నందుకు యువకుడు సూసైడ్

తాండూరు, వెలుగు: వికారాబాద్​ జిల్లా పెద్దేముల్ మండలం ఖానాపూర్ లో మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతున్న ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన జోగు రవి (26) మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు పొలానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. 

ఫోన్ చేయగా స్పందించలేదు. పొలంవైపు  వెళ్లి వెతకగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో తాండూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడాఇ నుంచి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ మిషన్ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తీసుకువెళ్లినా ప్రాణాలు దక్కలేదు.   కేసు దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై  ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.