తప్పుచేస్తే తలవంచాల్సిందే : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

తప్పుచేస్తే  తలవంచాల్సిందే : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: ఏ ప్రభుత్వమైనా తప్పుచేస్తే ప్రజల ముందు తల వంచాల్సిందేనని ప్రతిపక్షాలు పేర్కొన్నారు. నీట్​పేపర్​లీక్​ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేసిన అనంతరం పలువురు ప్రతిపక్ష నేతలు స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్​వేదికగా స్పందిస్తూ.. ‘విద్యా వ్యవస్థను సరిదిద్దడం కోసం దేశవ్యాప్తంగా వీధుల్లో గళం విప్పిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం ఇది. 

ఈ ప్రభుత్వం అవినీతిమయం కావడం వల్ల తమ రక్తాన్ని, తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలన్నింటి విజయం ఇది’ అని పోస్ట్ చేశారు. అలాగే, విద్యార్థుల ప్రయోజనాల కోసం పార్లమెంటు నుంచి వీధుల వరకు గళం విప్పిన ప్రతిపక్షం సాధించిన విజయమని కూడా ఆయన పేర్కొన్నారు.