
హీరోయిన్స్‌కు పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గుతాయనేది పాత మాట. కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ పెళ్లి తర్వాత మరింత బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలతో జోరుమీదుంది. ఓ వైపు బాలీవుడ్ సినిమాలు, మరోవైపు సౌత్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉందామె. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ అనగానే మొదటి పేరు కియారాదే వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌కు జంటగా ‘గేమ్ చేంజర్’లో నటిస్తున్న ఆమె.. మరో రెండు హిందీ సినిమాలతో పాటు, ఓ కన్నడ సినిమాకు సైన్ చేసింది.
యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనుండటం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాతో ఆమె శాండిల్‌వుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ‘డాన్’ ప్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘డాన్ 3’లో రణ్‌వీర్ సింగ్‌కు జంటగా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్, హృతిక్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘వార్ 2’లోనూ ఆమె నటిస్తోంది. మే 1 నుంచి ఆమె ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవనుంది. మొత్తానికి వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతోంది కియారా అద్వానీ.