మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
  • కిడ్నాపర్‌ అరెస్టు.. తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత

హైదరాబాద్: చిన్నారిని చాక్లెట్ తో మచ్చిక చేసుకుని.. ఆపై కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిన కిడ్నాపర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ చెరలో ఉన్న మూడేళ్ల బాలుడ్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కిడ్నాప్ కేసును ఛేదించిన సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ సిపి విశ్వప్రసాద్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన శివకుమార్, అంబికా దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి పలు పనులు చేసుకుని జీవిస్తున్నారు. నాంపల్లి లోని లేబర్ అడ్డా వద్ద తమ కుమారునితో పాటు,మరో ఇద్దరు అమ్మాయిలతో పనికోసం రోజూ వచ్చే వారు. వీరి వద్ద ఉన్న ముగ్గురు పిల్లలను గమనించిన నిందితుడు శ్యామ్ భీమ్ రావ్ సోలం  బాలుణ్ణి ఎలాగైనా కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశాడు. బాలుడి తల్లిదండ్రులతో చనువుగా ఉంటూ వచ్చాడు. అదను చూసి ఈనెల 8వ తేదీన పబ్లిక్ గార్డెన్ వద్ద ఆడుకుంటున్న బాలుడికి చాక్లెట్ ఇప్పిస్తానని ఆశ చూపి ఎత్తుకుని వెళ్లిపోయాడు. కాలినడకనే ఎంజీబీఎస్ బస్టాండుకు చేరుకుని అక్కడ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లి.. మహారాష్ట్ర పచ్చిం జిల్లాకు తీసుకెళ్లాడు. తమ కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన  శివ కుమార్, అంబికా దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. దాదాపు 300 సిసి కెమెరాలు పరిశీలించి కిడ్నప్ కు గురైన బాలుణ్ణి, నిందితుడుని తో సహా పట్టుకున్నారు. కిడ్నాపర్ చెరలో ఉన్న చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

For more news…

దృష్టి మళ్లించి చోరీ.. క్షణాల్లో పరార్..  ఇరానీ గ్యాంగ్ గుట్టు రట్టు

ఏం కష్టమొచ్చిందో.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి

ఊహించని ఘటన ఎదురైతే ఎలా రియాక్ట్ కావాలి?