కరోనా నుంచి కోలుకున్న వారిలో కిడ్నీల సమస్య

కరోనా నుంచి కోలుకున్న వారిలో కిడ్నీల సమస్య

వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా. కరోనా సోకిన తర్వాత మన రోగ నిరోధక వ్యవస్థ చాలా దెబ్బతింటోందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక పరిశోధనలో మరో షాకింగ్ విషయం బయటపడింది. 

కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు తేలింది. కరోనా సోకిన తర్వాత ఇంటి దగ్గర చికిత్స తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. వారికి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం కూడా పెరిగే అవకాశం ఉందట.

 కరోనా వైరస్ తో వచ్చే మరో తీవ్రమైన సమస్య  కిడ్నీకి సంబంధించిందంటున్నారు నిపుణులు. ప్రతి 10 వేల మందిలో సుమారు 7.8 మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు సెయింట్ లూసియానాలోని వెటరన్ ఎఫైర్స్ కార్యాలయంలో పనిచేసే జియాద్ అల్ అలీ తెలిపారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారికంటే.. ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందిన వారికి ఈ సమస్య వచ్చే అవకాశం 23 శాతం అధికంగా ఉన్నట్లు జియాద్ తెలిపారు. అది కూడా కరోనా నుంచి కోలుకున్న 6 నెలలకే ఈ కిడ్నీ సమస్య మొదలవుతోందన్నారు.