టీ20ల్లో పోలార్డ్ అరుదైన చరిత్ర

టీ20ల్లో పోలార్డ్ అరుదైన చరిత్ర

ప్రస్తుత కాలంలో క్రికెట్ ఆడాలంటే ఎంతో టాలెంట్..టెక్నిక్..వీటి కంటే ముఖ్యంగా ఫిట్నెస్ ఉండాలి. అప్పుడే ఏ క్రికెటర్ అయినా కెరీర్లో సక్సెస్ అవుతాడు. సుధీర్ఘ కాలం పాటు..క్రికెట్లో కొనసాగుతాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో చాలా కాలంపాటు ఉండాలంటే ఆటగాడికి ఫిట్ నెస్ అంత్యంత కీలకం. అలాంటి ఫిట్ నెస్ కాపాడుకోవడమే కాకుండా..ధనాధన్ క్రికెట్ లో దంచి కొడుతూ..ఏకంగా 600 మ్యాచులు ఆడాడు విండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్. హండ్రెడ్‌ టోర్నీలో  లండన్‌ స్పిరిట్స్‌ తరపున ఆడుతున్న పోలార్డ్ ..మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు.  టీ20ల్లో 600 మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర కెక్కాడు. తన 600 వ టీ20  మ్యాచ్‌లో పొలార్డ్‌ 11 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి.  

600 టీ20 మ్యాచుల్లో..
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 600 మ్యాచులంటే మామూలు విషయం కాదు. 14 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాపై టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన పోలార్డ్..ఇన్నేళ్ల  టీ20 కెరీర్ లో పోలార్డ్ విజయవంతమైన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఇక 600 మ్యాచుల్లో 31.34 సగటుతో 11,723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ లోనే కాదు..బౌలింగ్ లోనూ అదరగొట్టాడు. బౌలింగ్ లో 309 వికెట్లు పడగొట్టాడు. పొలార్డ్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 4/15 గా ఉంది.

ఎన్నో జట్లకు ప్రాతినిధ్యం..
 దాదాపు 14  ఏళ్ల నుంచి టి20ల్లో కొనసాగుతున్న  పొలార్డ్‌ వెస్టిండీస్‌తో పాటు మరెన్నో జట్లకు ఆడాడు.  దేశవాలీలో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగొ, కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, బీబీఎల్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో డాకా గ్లాడియేటర్స్‌, డాకా డైనమిటీస్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ లో కరాచీ కింగ్స్‌, ముల్తాన్‌ సుల్తాన్స్‌, పెషావర్‌ జాల్మి జట్ల తరపున టీ20ల్లో ఆడాడు. 

టీ20ల్లో  పొలార్డ్‌ తర్వాత అత్యధిక మ్యాచులు ఆడిన జాబితాలో 543 మ్యా చులతో  డ్వేన్‌ బ్రావో రెండో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత 472 టీ20లతో  షోయబ్‌ మాలిక్‌, 463 మ్యాచులతో క్రిస్‌ గేల్‌, 426 మ్యాచులతో రవి బొపారా తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. 

బుమ్రా శుభాకాంక్షలు..
600 టీ20 మ్యాచులు ఆడిన పోలార్ట్ ను టీమిండియా బౌలర్ బుమ్రా అభినందించాడు. 600 మ్యాచులు అంటే అద్భుతమైన మైలురాయి అని కొనియాడాడు. పాపాలీ @KieronPollard55కి అభినందనలు," అని బుమ్రా ట్వీట్ చేశాడు.