IPL 2026: కాసేపట్లో KKR vs LSG మ్యాచ్.. తుది జట్టు నుంచి కామెరాన్ గ్రీన్, వరుణ్ చక్రవర్తి ఔట్

IPL 2026: కాసేపట్లో KKR vs LSG మ్యాచ్.. తుది జట్టు నుంచి కామెరాన్ గ్రీన్, వరుణ్ చక్రవర్తి ఔట్

IPL 2026: ఐపీఎల్ 19వ ఎడిషన్ లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 9న) ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరగనున్న కీలక పోరుకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీమ్ వరుస ఓటములతోనే ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది. తుది జట్టు నుంచి 25 కోట్లకు కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ గ్రీన్ తో పాటు మిస్టర్ స్పీన్నర్ గా పేరుగాంచిన వరుణ్ ని తప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

నరైన్ ఎంట్రీ.. బౌలింగ్‌కు బూస్ట్: 
అనారోగ్యం కారణంగా పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. మంగళవారం నాడు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్న నరైన్, నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అనుభవం లేని కేకేఆర్ బౌలింగ్ విభాగానికి నరైన్ రాక పెద్ద ఊరట అని చెప్పాలి.

చక్రవర్తికి గాయం.. కేకేఆర్ ఆందోళన: 
మరోవైపు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తుంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి ఎడమ చేతికి గాయం కావడంతో, ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం అతను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పటికీ, కీలక సమయంలో వరుణ్ దూరం కావడం జట్టుకు పెద్ద మైనస్ గా మారింది.

Also Read : రెడ్-బాల్ క్రికెట్‌ ఆడొద్దని డాక్టర్ చెప్పారు
 
కామెరాన్ గ్రీన్ ని తప్పించే ఛాన్స్: 
ఐపీఎల్ 2026 లీగ్ ప్రారంభమైప్పటికీ నుంచి కేవలం బ్యాటర్‌గానే ఆడుతున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో అతడ్ని ఈరోజు జరిగే మ్యాచ్ నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జోరుగా నెట్టంట ప్రచారం కొనసాగుతుంది. కానీ ఈరోజు మ్యాచ్‌లో బౌలింగ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో, గ్రీన్ తన పేస్‌తో లక్నో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడని కేకేఆర్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

తుది జట్ల అంచనా: 
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ ( వికెట్ కీపర్), రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్/రోవ్‌మన్ పావెల్, వరుణ్ చక్రవర్తి/నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/ వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మొహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.