అమాయకులను చంపేశారు

అమాయకులను చంపేశారు
  • మా వాళ్ల డెడ్​బాడీలు అప్పగించండి
  • హైదర్​పొర ఎన్​కౌంటర్​మృతుల బంధువుల నిరసన
  • వాళ్లు టెర్రరిస్టులు కాదని వెల్లడి

శ్రీనగర్: హైదర్​పొర ఎన్​కౌంటర్​లో మృతి చెందిన ఇద్దరు సివిలియన్లు అల్తాఫ్​ భట్, ముదాసిర్ ​గుల్​డెడ్​బాడీలను అప్పగించాలని వాళ్ల బంధువులు డిమాండ్ ​చేశారు. వాళ్లిద్దరూ టెర్రరిస్టులు కాదని, టెర్రరిస్టులకు సాయంచేయలేదని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ బుధవారం శ్రీనగర్​లో ప్రెస్​ ఎన్​క్లేవ్ ​దగ్గర నిరసన తెలిపారు. భట్​30 ఏండ్లుగా హైదర్​పొరలో బిజినెస్​ చేస్తున్నారని ఆయన సోదరుడు అబ్దుల్​ మజీద్ ​చెప్పారు. భట్​బిల్డింగ్​లో కిరాయికి ఉంటున్న వాళ్ల వివరాలను పోలీసులకు ఇచ్చి వెరిఫై చేయించుకున్నామని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తమను కలవాల్సిందని అన్నారు. ‘నా బ్రదర్​ బిల్డర్, ట్యాక్స్​కడుతున్నారు. లోకల్​లో ఎవరిని అడిగినా చెప్తారు. పోలీసులకూ ఆయన తెలుసు. రోజూ ఆయనుండే ప్లేస్​కు వస్తారు. కలిసి టీ తాగుతారు’ అని చెప్పారు. ‘సోమవారం టాస్క్​ఫోర్స్​పోలీసులు వచ్చి భట్​ను ఇంట్లోని పై పోర్షన్​లోకి తీసుకెళ్లారు. మూడుసార్లు సెర్చ్​చేశారు. డ్రోన్లు కూడా వాడారు. చివరికి అమాయకుడైన భట్​ను చంపేశారు’ అని కన్నీరుమున్నీరయ్యారు. తన సోదరుడు ఏదైనా చట్ట వ్యతిరేక పనులు చేసినట్టు తేలితే తనను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. తమకు న్యాయం కావాలని, డెడ్​బాడీలను అప్పగించాలని అల్తాఫ్​ ఫ్యామిలీ డిమాండ్​ చేసింది.

టెర్రర్ ​కార్యకలాపాలు సాగుతున్నాయని..

ఎన్​కౌంటర్​లో ఓ పాకిస్తానీ టెర్రరిస్టు, అతనికి స్థానికంగా సాయం చేస్తున్న మహ్మద్ ఆమిర్, ఇద్దరు లోకల్​ సివిలియన్స్​ అల్తాఫ్​  భట్, ముదాసిర్ ​గుల్​మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. అల్తాఫ్​భట్​ తన ఇంటిని గుల్​కు అద్దెకిచ్చాడని, ఆ ఇంట్లో అక్రమంగా కాల్​సెంటర్​ నడుస్తోందని, టెర్రర్ ​కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపారు. ఎన్​కౌంటర్​లో టెర్రరిస్టులతో పాటు చనిపోయిన ఇద్దరు వ్యక్తులు టెర్రరిస్టుల సానుభూతిపరులని పోలీసులు చెప్పడం, ఈ ఆరోపణలను బంధువులు కొట్టిపారేయడంతో వివాదం చెలరేగింది.