పాల్వంచ, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టును సీడీఎస్ఈ(ప్రాజెక్టుల భద్రత స్థిరత్వ సమర్థత పరిశీలన) బృందం మంగళవారం సందర్శించింది. కిన్నెరసాని ప్రాజెక్టుకు చిన్నపాటి సమస్యలు తప్ప భారీ ముప్పు లేదని సీడీఎస్ఈ చైర్మన్ రామరాజు తెలిపారు. ప్రాజెక్టు లీకేజీలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీపీఎస్ అధికారులను ఆదేశించారు. కమిటీ సభ్యులు వెంకటరమణ, శ్రీకాంత్, లక్ష్మణ్ రావు, కేటీపీఎస్ ఎస్ఈ మోక్షవీర్, ఈఈ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఏఈ సురేశ్ పాల్గొన్నారు.
