కిన్నెరసాని ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

కిన్నెరసాని ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
  • నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో నిల్వ చేసే అవకాశం లేక దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ప్రాజెక్టు వద్ద 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. 
 కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. ఎగువన నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కిన్నెరసానిలో వరద పరవళ్లు తొక్కుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 404 అడుగులకు చేరింది.  ఇన్ ఫ్లో 72 వేల క్యూసెక్కులు ఉండగా.. అరు గేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల ప్రారంభానికి ముందు నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశారు. వరద అంతకంతకు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ప్రాజెక్ట్ అధికారులు.