Kiran Abvbavaram: తొలి సినిమా హీరోయిన్తో కిరణ్ పెళ్లి..ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ..ఫొటోస్ వైరల్

Kiran Abvbavaram: తొలి సినిమా హీరోయిన్తో కిరణ్ పెళ్లి..ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ..ఫొటోస్ వైరల్

రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే.వధువు మరెవరో కాదు తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ (Rahasya Gorak).

గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరిగింది. కొన్ని రోజుల క్రితమే కిరణ్ అబ్బవరం తన సినిమా ఈవెంట్లో ఆగస్టులో పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించాడు. అలాగే హ్యాపీ బర్త్‌డే డియర్ కిరణ్‌..మరో 38 రోజుల్లో నిన్ను..మై హస్బెండ్‌ అనేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా’’అని రహస్య కూడా తెలిపింది. 

తాజాగా అబ్బవరం పెళ్లి పనులు మొదలయ్యాయి. రహస్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పూజలు చేస్తున్నారు. అలాగే సంగీత్ కి డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న  వీడియో కూడా షేర్ చేసింది. దీంతో పెళ్లి పనులు షురూ కాగా వీరి  వివాహం ఆగస్టు 22న జరగనున్నట్లు తెలుస్తోంది. 

వీరిద్దరూ ముందుగా కేరళలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అక్కడ వరదలతో పరిస్థితి భయనకరంగా ఉంది. అందుకే పెళ్లి వేదికను కర్ణాటకకు మార్చినట్లు సమాచారం. కూర్గ్ వేదికగా కిరణ్‌ అబ్బవరం-రహస్యల వివాహం జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘క’ అనే సింగిల్ లెటర్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.