హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీఓ) వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ఫోరమ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ భవన్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా డి.కిషన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీనివాసరెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కె.రామారావు ప్రకటించారు.
అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్.మధుసూదనాచారి, ఉపాధ్యక్షులు కేశవులు, ఎస్.వెంకట్ నర్సింహా, వెల్ది ఇందిర కోశాధికారిగా ఎం.సతీశ్, జాయింట్ సెక్రటరీలుగా ఎండీ మూస, బి.మోహన్, వి.పద్మావతి ,ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.రమేశ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎస్.రాకేశ్ రెడ్డి ఎంపికయ్యారు. అలాగే, గుంటి బిక్షపతి, టి.హరిప్రసాద్, సరిపల్లి మురళిలను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా టీజీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికైన నాయకులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.
