విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు జరపడం లేదు? : కిషన్ రెడ్డి

విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు జరపడం లేదు? : కిషన్ రెడ్డి

తెలంగాణలో సెప్టెంబరు 17న రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని  ఎందుకు జరిపించడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.   మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించడం లేదని ఆయన  ఆరోపించారు. 

Also Read :- జీ20 విందుకు కేసీఆర్కు ఆహ్వానం ..వెళ్తారా.. డుమ్మా కొడతారా..

విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ 25 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి.  ఈ విషయంలో ఎక్కడా కూడా రాజీపడే ప్రసక్తి లేదన్నారు.   75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తెలంగాణలో త్రివర్ణ  పతాకం ఎగరేస్తే.. గత ఏడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాలను అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు.