లోక్ సభ అభ్యర్థుల ఎంపిక చేసేది అధిష్టానమే : కిషన్ రెడ్డి

లోక్ సభ  అభ్యర్థుల ఎంపిక చేసేది అధిష్టానమే : కిషన్ రెడ్డి

హైదరాబాద్: లోక్ సభ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానానిదేనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సిట్టింగులను మార్చే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. సికింద్రాబాద్ నుంచి తాను, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావ్ పోటీలో ఉంటున్నట్టు క్లారిటీ ఇచ్చారు. మంద కృష్ణ మాదిగ పోటీపై ఎక్కడా చర్చ జరగలేదని తెలిపారు. 

బీజేపీ శాసన సభా  పక్ష నేత ఎంపికపై ఢిల్లీ నుంచి అబ్జర్వర్లు వచ్చాక  క్లారిటీ వస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ నినాదం వర్కవుట్ అయ్యిందని, ఓట్లశాతం గణనీయంగా  పెరిగిందని చెప్పారు. ఫిబ్రవరి  28వ తేదీగానీ, మార్చి మొదటి వారంలో గానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కొత్త మురిపెంలా ఉందంటూ సెటైర్ వేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించబోమని చెప్పారు.