బీఆర్​ఎస్, కాంగ్రెస్​భాయ్భాయ్.. కేటీఆర్​కు కిషన్రెడ్డి కౌంటర్​

బీఆర్​ఎస్, కాంగ్రెస్​భాయ్భాయ్.. కేటీఆర్​కు కిషన్రెడ్డి కౌంటర్​

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మనం కూడా భాగస్వాములుగా ఉంటాం అని కేటీఆర్  కామెంట్​పై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడిన వీడియోను కిషన్ రెడ్డి మంగళవారం షేర్ చేశారు.‘ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల బలమైన బంధం బట్టబయలైంది. కల్వకుంట్ల కుటుంబ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల బంధంపై స్పష్టతనిచ్చాడు. ఇక తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే’ అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని బంగారు కుటుంబ సభ్యుడు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్ భాయ్​ భాయ్​ అనేందుకు కేటీఆర్ మాటలే సాక్ష్యం అంటూ కిషన్ రెడ్డి ట్వీట్​లో పేర్కొన్నారు.