ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జెండా ఎగరాలె

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జెండా ఎగరాలె

గద్వాల, వెలుగు : జమ్మూ కాశ్మీర్ విముక్తి కోసం, నూతన విద్యా విధానం కోసం, రామ్ మందిర్ నిర్మాణం కోసం ఏబీవీపీ కృషి చేసిందని  కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్​ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఏబీవీపీ 40వ మహాసభలకు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ చీఫ్​గెస్ట్​లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ  శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారన్నారు. ఆగస్ట్ 15న ప్రతి భారతీయుడి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగురవేయాలని కోరారు. డీకే అరుణ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ పోరాటాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజమాత ఫౌండేషన్ ​ఫౌండర్ ఉదయ్ కుమార్ రెడ్డికి జనమంచిలి గౌరీ యువ పురస్కార్ అవార్డు అందజేశారు. బీజేపీ లీడర్లు జితేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, శాంతకుమార్, 33 జిల్లాల ప్రతినిధులు  పాల్గొన్నారు.

ఫండ్స్​ ఇచ్చినా ఉపయోగించుకోవడం లేదు

మహాసభల తర్వాత జోగులాంబ టెంపుల్ కు వెళ్లిన మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. రెవెన్యూ, టూరిజం శాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. తర్వాత మాట్లాడుతూ కేంద్ర టూరిజం శాఖ తరపున టెంపుల్​ కోసం రూ.36 కోట్ల 73 లక్షలు మంజూరు చేశామన్నారు. అందులో ఇప్పటికే రూ.ఐదు కోట్లు రిలీజ్ చేశామని, ఇవి 2018కి  సంబంధించిన ఫండ్స్ మాత్రమే అని అన్నారు. వాటిని ఇప్పటి వరకూ  ఉపయోగించుకోలేదన్నారు. అలాగే టెంపుల్ ఇన్​సైడ్​ డెవలప్​మెంట్​ కోసం రూ.3 కోట్ల 70 లక్షలు ఇచ్చామని, వాటితో కలరింగ్, ఎలక్ట్రికల్, ఇతర పనులు చేయాలన్నారు. ప్రసాద్ స్కీం కింద మరో రూ.36 కోట్ల 70 లక్షలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, ఈ ఫండ్స్​తో బస్టాండ్ నిర్మాణం, నిత్యాన్నదాన భవనం, 21 టూరిజం రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఫండ్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర టూరిజం శాఖ లేట్ చేస్తోందని విమర్శించారు. మరొకసారి రెవెన్యూ టూరిజం శాఖ ఆఫీసర్లతో హైదరాబాద్​లో  రివ్యూ మీటింగ్ నిర్వహించి పనులు ఫాస్ట్ గా జరిగేలా చూస్తామన్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదని, కేవలం డెవలప్​మెంట్​ పైనే దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. సాధ్యమైనంత తొందరగా టెంపుల్ డెవలప్​మెంట్​ చేసేందుకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ కృషి చేస్తుందన్నారు.

ఈటల గెలుపు జీర్ణంచుకోలేకే.. 

కొత్తకోట :  కల్వకుంట్ల కుటుంబ రాజకీయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బలిపశువును చేయొద్దని కిషన్​ రెడ్డి కోరారు. కొత్తకోటలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్​రెడ్డి ఇంట్లో కిషన్​రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్​ఎన్నికల్లో ఈటల గెలుపుతో కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుందన్నారు. రాష్ర్టంలో అన్నదాతల నుంచి బీజేపీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేకే ధాన్యం కొనడం లేదని తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్​ప్రకారం వచ్చిన ధాన్యాన్ని కేంద్రం కొంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్​ రెడ్డి, కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శ్రీనివాస్​ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు  శ్రీకాంత్​ రెడ్డి పాల్గొన్నారు.