భారత సంస్కృతికి మోదీ ఒక అంబాసిడర్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారత సంస్కృతికి మోదీ ఒక అంబాసిడర్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: మాదాపూర్ లో భారత్ కళామండపానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో సంగీత్ నాటక్ అకాడెమీ దక్షిణ భారతీయ సంస్కృతి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో కళాకారుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

Also Read :  27మంది జెడ్పీ సీఈవోల బదిలీ

భారత ప్రభుత్వం అజాధ్ కా అమ్రిత్ మహోత్సవంలో బాగంగా అనేక కార్యక్రమలు చేపట్టామని.. ఈరోజు మొత్తం మూడు కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో 700 మంది కూర్చునే ఘంటశాల, వెంకటేశ్వర రావు పేరుతో ఒక ఆడిటోరియంకు భూమి పూజ చేశామని చెప్పారు.కళాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు కిషన్ రెడ్డి. జీ20లో జరిగిన ప్రతి సదస్సులో కూడా భారతీయ సంస్కృతి ప్రతిబంబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహించినట్లు తెలిపారు.

ప్రధాని మోదీ అధ్వర్యంలో అయోధ్యలో 550 సంవత్సరాల కళా నెరవేరిందని.. దేశ సంస్కృతికి మోదీ ఒక అంబాసిడర్ అని కొనియాడారు. కాకతీయులు నిర్మించిన వరంగల్ లోని వెయ్యి స్థంబాల గుడిని.. అదే పోలికలతో పునర్ నిర్మిస్తున్నామని చెప్పారాయన. త్వరలోనే హైదరాబాద్ లో నిర్మించబోయే గిరిజనులకు సంబంధించి ట్రైబల్ మ్యూజియంను శంకుస్థాపన చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.