సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం 7వందల 15 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తం మూడు దశల పనుల్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్లాట్ ఫామ్ 1లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న బిల్డింగ్ పనులను పరిశీలించారు కిషన్ రెడ్డి. స్టేషన్ ఆధునీకరణ పనులకు సంబంధించి రైల్వే జీఎం, ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు కిషన్ రెడ్డి. 

అంతర్జాతీయ విమానాశ్రయానికి ధీటుగా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు కిషన్ రెడ్డి.  ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయని వెల్లడించారు.  రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో కూడుకొని ఉంటుందని చెప్పారు.  ఈ సందర్భంగా రైల్వే శాఖ అధికారులను అభినందించారు.  

ALSO READ :- కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది : ప్రధాని మోదీ

మరోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.  మోదీ చేతుల మీదుగానే  2025 లో రైల్వే స్టేషన్ ను జాతికి అంకింతం చేస్తామని స్పష్టం చేశారు.  కోమరవెల్లి మల్లన్న దర్శనం కోసం ప్రధాని నూతన రైల్వే స్టేషన్ నిర్మాణానికి  ఫిబ్రవరిలో మోదీ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.