కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది : ప్రధాని మోదీ

కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అవుట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని  ఆరోపించారు. పత్రికా స్వేచ్చనుకాంగ్రెస్ కాల రాసిందని అన్నారు. కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావని మోదీ జోస్యం చెప్పారు.

 దేశాన్ని మరోసారి విభజించడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని మోదీ ఆరోపించారు. యుద్ధవీరులను కాంగ్రెస్ గుర్తించుకోలేదని ఫైర్ అయ్యారు. జీఎస్టీని సమర్థంగా అమలు చేశామని అన్నారు. యూపీఏ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యిందని విమర్శించారు. అంబెద్కర్ కి కాంగ్రెస్ భారత్ రత్న ఇవ్వాలనుకోలేదని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రాత్రికి రాత్రే కూల్చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటీషర్స్ అని అన్నారు. 

ALSO READ :- Aaru Sethulunnaa Song: సలార్ కాటేరమ్మ వీడియో సాంగ్ వచ్చేసింది..మూడు గంటల్లోనే 50 వేలకి పైగా వ్యూస్

  తనకు మాట్లాడే అధికారాన్ని ప్రజలుకట్టబెట్టారని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బయటకు తెచ్చామనిచెప్పారు. పదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఐదో స్థానానికి తెచ్చామని అన్నారు. కాంగ్రెస్ పతనం తనకు ఆనందాన్ని ఇవ్వదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం తీవ్రవాదం పెరిగిందని మోదీ ఆరోపించారు.