Aaru Sethulunnaa Song: సలార్ కాటేరమ్మ వీడియో సాంగ్ వచ్చేసింది..మూడు గంటల్లోనే 50 వేలకి పైగా వ్యూస్

Aaru Sethulunnaa Song: సలార్ కాటేరమ్మ వీడియో సాంగ్ వచ్చేసింది..మూడు గంటల్లోనే 50 వేలకి పైగా వ్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీ సలార్(Salaar). కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి సినీ ప్రేక్షకులకి తెగ నచ్చేసింది.

ఈ సినిమాలో ఖాన్సర్ లో చెలరేగే ప్రభాస్ యాక్షన్ సీన్స్కు సినీ లవర్స్ ఫిదా అయ్యారు. అలాగే సలార్లో సందర్భనుసారంగా వచ్చే సాంగ్స్ సైతం ఆడియన్స్కి గూస్బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ఖాన్స‌ర్‌లో చిన్న పిల్లలని కూడా చూడకుండా..విలన్ ఆడపిల్లలను అత్యాచారం చేసే సీన్లో వచ్చే యా..యా సాంగ్ వీపరీతంగా ఆకట్టుకుంది. 

లేటెస్ట్గా సలార్ మేకర్స్ ఆరు సేతులున్నా గాని వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రతిఒక్కరి ఆత్మను కదిలించే ఈ పాటలో వచ్చే లిరిక్స్..సీన్స్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఆరు సేతులున్నా గాని ఆదుకొను సెయ్యి రాదమ్మా యా.. యా.. యా.. యా, గుక్కపెట్టి రంది ఉంటే ఎడ జాడ కానరావమ్మ యా.. యా.. యా.. యా’ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

 ALSO READ :- కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది : ప్రధాని మోదీ

ఈ పాటలో చుట్టూ ఉన్న జనం కాటేరమ్మ దైవం వస్తుందనే ఆశతో పాడుకుంటున్న ఈ పాట..ప్రస్తుతం యూట్యూబ్లో ట్రేండింగ్ అవుతోంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన కేవలం మూడు గంటల్లో 50 వేలకి పైగా వ్యూస్ సాధించింది. ప్రస్తుతం ఈ సాంగ్ గంట గంటకి యూట్యూబ్లో అదిరిపోయే వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా..కనకవ్వ పాడింది. ఈ సాంగ్లో ప్రభాస్ లో రాజసం..రాక్షసం..భీకరమైన గంభీరం చూడొచ్చు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.