టికెట్ ఎవరికొచ్చినా కలిసి పన్జేయాలె : బీజేపీ ఆశావహులకు కిషన్ రెడ్డి పిలుపు

టికెట్ ఎవరికొచ్చినా కలిసి పన్జేయాలె : బీజేపీ ఆశావహులకు కిషన్ రెడ్డి పిలుపు
  • టికెట్ ఎవరికొచ్చినా.. కలిసి పన్జేయాలె
  • బీజేపీ ఆశావహులకు కిషన్ రెడ్డి పిలుపు  

హైదరాబాద్, వెలుగు : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన బీజేపీ ఆశావహులతో మంగళవారం బర్కత్​పురలోని సిటీ బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమావేశమయ్యారు. 

సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఆశావహులతో వారు మాట్లాడారు. టికెట్ ఎవరికి వచ్చినా.. అందరూ కలిసి పని చేసుకోవాలని సూచించారు. అన్ని చోట్ల పార్టీ బలంగా ఉందని, కలిసి పనిచేస్తే గెలుస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు.